వైసీపీ ఆరోపణలకు బడేటి చంటి ధ్వజం..

వైసీపీ ఆరోపణలకు బడేటి చంటి ధ్వజం..

23/August/2026 21:08    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు.
అవగాహనా రాహిత్యంతో మెగా డీఎస్సీ నిర్వహణపై అసత్య ఆరోపణలు చేసేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు అసెంబ్లీలో ఆ అంశంపై ప్రస్తావించేందుకు కూడా సాహసించలేకపోయారని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి.. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ అసెంబ్లీ సాక్షిగా విసిరిన బహిరంగ సవాల్‌ను స్వీకరించలేక చేతులెత్తేసిన వైసీపీ ప్రజా ప్రతినిధులు,,, తాము చేసిన ఆరోపణలు నిరూపించలేక చతికిలబడ్డారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఏలూరు పవర్‌ పేటలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా భేటీలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెగా డీఎస్పీపై విచారణ చేపట్టాలని పట్టుబడుతున్న వైసీపీ నేతలు,,, ఆ అంశాన్ని అసెంబ్లీకి వచ్చి ఎందుకు ప్రస్తావించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. గతంలో గ్రూప్‌-1 పరీక్షల్లో అవినీతి జరిగిందని సిట్‌ నివేదిక పలు విషయాలను తేటతెల్లం చేసిందని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి,,, మొదట దానిపై ఎంక్వైరీ చేయించాలనే నినాదాన్ని వైసీపీ నేతలు ఎత్తుకోవాలంటూ తనదైన శైలిలో చమత్కరించారు. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై కాకుండా తమ స్వలాభం కోసం రాద్ధాంతం చేయాలని చూస్తే రానున్న రోజుల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదంటూ ఆయన దుయ్యబట్టారు. మతిభ్రమించిన వారిలా ప్రవర్తించకుండా మసులుకోవడం మంచిదంటూ ఆయన హితవు పలికారు...
Breaking News

Subscribe our Newsletter