ప్రజా వ్యతిరేక విధానాలను స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో తిప్పి కొట్టండి..

ప్రజా వ్యతిరేక విధానాలను స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో తిప్పి కొట్టండి..

15/August/2026 19:49    Share:   

మహోన్నత వీరుల పోరాట ఫలితం దేశ స్వాతంత్ర్యం.ప్రజా వ్యతిరేక విధానాలను స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో తిప్పి కొట్టండి.విద్యార్థి యువత తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్.ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్. సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్.

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏరియా సమితి,ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఎఐటియుసి)ఆధ్వర్యంలో భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఏలూరు టౌన్ ఆల్ ట్రేడ్ వర్కర్స్ అసోసియేషన్ ఎఐటియుసి ఆధ్వర్యంలో రామకృష్ణాపురం మినీ బైపాస్ రోడ్డు లోని అసోసియేషన్ కార్యాలయం వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం స్వాతంత్ర్యం పొందడం కోసం అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేసి, రక్త తర్పణలు గావించి మన కోసం పోరాడిన మహనీయులను మనం నిత్యం మననం చేసుకోవాలని ఆకాంక్షించారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత పాలకులు అవలంబిస్తున్న విధానాల వలన ఇంకా అసమానతలు,వివక్షత కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో ప్రస్తుత పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అనంతరం యూనియన్ మాజీ అధ్యక్షులు ఉప్పులూరి హేమ శంకర్ ప్రతిజ్ఞ చేయించారు.
16వ డివిజన్ అరుంధతిపేటలో జాతీయ పతాకాన్ని కొల్లూరి సుధారాణి ఎగురవేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న అవినీతి ఆశ్రిత పక్షపాతం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఏరియా సహాయ కార్యదర్శి కూరేళ్ల వరప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని విద్యార్థులు యువత నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వత్ర చర్చ జరుగుతుందని ఆయా వర్గాల ప్రయోజనాల కోసం హక్కుల కోసం జరిగే పోరాటాలకు ప్రజలంతా మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టి జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ది ఏలూరు ఆల్ ట్రేడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఉప్పులూరి కేశవరావు, కమిటీ సభ్యులు మరకాల సందీప్, మోరు అమర్ నాథ్, బండారు రమేష్, అబ్దుల్ లుక్మాన్, అబ్దుల్ ఆసిఫ్ పాషా, బోశెట్టి పవన్ కుమార్, కలిదిండి వెంకటేష్, సుంకర లక్ష్మణరావు, కన్నూరి రమేష్,ఆడారి మహేష్,మహబూబ్ షరీఫ్, బొడ్డు శివరామకృష్ణ, బొడ్డు సురేష్, తాళ్లూరి బాబురావు, రవి, తిమ్మాపురం శ్రీను, కాటూరి శ్రీధర్, గూన ఆశీర్వాదం, మూసాఖాన్, మేకల శివ,ఉప్పులూరి లక్ష్మి, భవాని, ఉప్పులూరి ప్రభావతి ఉప్పులూరి కృష్ణ,ఉప్పులూరి వినోద్, ఆలూరి ప్రభాకర్, కొండేటి ఆదామ్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter