ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన తరగతుల గదులు ప్రారంభం..!
28/July/2026 20:22
Share:
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
ఎలమంచిలి నియోజకవర్గం.రాంబిల్లి మండలం దిమ్మిలి గ్రామంలోని ఎస్‌బీఎస్ ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన.33 .32 లక్షలు.తరగతి గదులను ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ..ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోందన్నారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలని సూచించారు.అనంతరం ఎమ్మెల్యే . పాఠశాలలోని వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, వంటశాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం అనకాపల్లి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మహిళల భద్రత కోసం నిర్వహిస్తున్న ‘అభయం’ ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...