అనకాపల్లిలో ఘనంగా హోమ్ కంఫర్ట్స్ నూతన షోరూం ప్రారంభోత్సవం..
19/May/2026 08:09
Share:
అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో ఈరోజు 'హోమ్ కంఫర్ట్స్' నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సీ.ఎం. రమేష్ గారు విచ్చేశారు. వారితో పాటు రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ప్రముఖుల చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి ఈ నూతన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అతిథులంతా లోపల కలియతిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు యాజమాన్యానికి తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శ్రీనివాస్ ఏ,క్రైమ్ ఎనాలిసిస్, జిల్లా ఇన్చార్జ్.అనకాపల్లి.