తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 31,777 మంది దర్శించుకున్నారు . భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.70కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.