భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు - మన జెండా

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు - మన జెండా

20/April/2026 08:28    Share:   

యలమంచిలి/భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు - మన జెండా అనే కార్యక్రమంలో భాగంగా  పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విశాఖ డైరీ చైర్మన్  ఆడారి ఆనంద్ కుమార్  ఆదివారం యలమంచిలిలో ఆరు ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగిరేసి  పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఉనికిని చాటారు.
సుమారు 200 మోటార్ సైకిల్ తో 400 మంది కార్యకర్తలు పాల్గొని భారత్ మాతాకీ జై అనే నినాదంతో ఈ ర్యాలీని ముందుకి తీసుకువెళ్లారు, బాల బాలికలు వందేమాతరం గీతాన్ని ఆలపించి కార్యకర్తలని అక్కడ ఉన్న ప్రజల్ని ఆకట్టుకున్నారు.  మున్ముందు ముందు ఇలాగే మన ఐక్యతను చాటుకుని నరేంద్ర మోడీ  నాయకత్వాన్ని బలపరిచి దేశ పురోగతికి వెన్ను ధన్నుగా నిలవాలని ఆనందకుమార్  కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబర్  పిల్లా. రమాకుమారి, జిల్లా అధ్యక్షులు ద్వారపు రెడ్డి  పరమేశ్వరావు , పారిశ్రామిక వేత్త ముత్యాల. వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి ఆడారి శ్రీధర్ పట్టణ పార్టీ అధ్యక్షులు బొద్దపు. శివ తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter