మజ్జిగ పంపిణీ చేపట్టిన ఆర్యవైశ్య సంఘం మహిళలు..!

మజ్జిగ పంపిణీ చేపట్టిన ఆర్యవైశ్య సంఘం మహిళలు..!

20/April/2026 21:48    Share:   

క్రైమ్ అనాల్సిస్, టివియస్ ప్రకాష్ యలమంచిలి :
అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఆర్యవైశ్య సంఘం మహిళలు ఆదర్శప్రాయ సేవా కార్యక్రమం చేపట్టారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ రోడ్డులో గుప్తా మెడికల్ స్టోర్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఆరుబయట తిరిగే ప్రజల దాహం తీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మహిళలు, తమ సొంత నిధులను వినియోగించి సుమారు 500 మందికి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి సేవాభావం, మానవత్వం ప్రతిఫలించింది.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించడమే కాకుండా, సమాజానికి సేవ చేయాలనే తపనను ఆర్యవైశ్య సంఘం మహిళలు మరోసారి చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter