ఏలూరు బస్టాండ్ ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆర్టీసీ జోనల్ చైర్మన్,జనసేన పార్టీ ఇంచార్జ్

ఏలూరు బస్టాండ్ ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆర్టీసీ జోనల్ చైర్మన్,జనసేన పార్టీ ఇంచార్జ్

04/June/2026 20:35    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు,
 
ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు గురువారం ఏలూరు కొత్త బస్టాండ్ లో ఆకస్మిక తనిఖీ చేశారు. కొత్త బస్టాండ్ లో ఇటీవల వేసిన సీసీ రోడ్లను పర్యవేక్షించి,మరుగుదొడ్ల యొక్క పరిశీలన చేసి,ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. మొత్తం బస్టాండ్ అంతా తిరిగి ఇంకా చేయవలసిన పనులు మరియు RO వాటర్ ప్లాంట్, నాన్ స్టాప్ కౌంటర్, బి ఓ టి ప్రదేశాల్ని పరిశీలనగా పర్యవేక్షించారు. తొందర్లో రాబోతున్న ఎలక్ట్రికల్ బస్ లకు చార్జింగ్ పాయింట్లు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. నాన్ స్టాప్ కౌంటర్, విచారణ కేంద్రం క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంలో డ్రైవర్, కండక్టర్లకు ,ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు వివరాలు తెలుసుకొని సంతృప్తి చెంది మరిన్ని సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీమతి ఎస్.కె . షబ్నం, డిపో మేనేజర్ శ్రీమతి బి. వాణి, ఏ.ఎం.టి.శ్రీ అప్పాజీ, మెకానికల్ ఫోర్ మెన్ శ్రీ శ్రీనివాస్, పిఆర్ఓ కె.యల్. వి. నరసింహం, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter