కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు ఏలూరు జిల్లా పోలీస్ శాఖ మరియు ఈగల్ విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్రప్రహర్ కార్యక్రమాన్ని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీ, మాదేపల్లి ప్రాంతంలో నిర్వహించి, మాదక ద్రవ్యాల నిర్మూలన, నేరాల నియంత్రణ మరియు ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులకు డ్రగ్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా, ఒక వ్యక్తికి గంజాయి వినియోగం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేని 64 ద్విచక్ర వాహనాలను మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం అదుపులోకి తీసుకోన్న పోలీస్ అధికారులు.అనంతరం స్థానిక ప్రజలందరితో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించి, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.అదేవిధంగా, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ – 1972 లేదా పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ – 112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు 3 టౌన్ సీఐ శ్రీ కోటేశ్వరరావు గారు, టూ టౌన్ సీఐ శ్రీ అశోక్ కుమార్ గారు, ఏలూరు రూరల్ ఎస్‌ఐ శ్రీ వి. వెంకటేశ్వరరావు గారు, ఈగల్ ఆర్‌ఎస్‌ఐ శ్రీ బి. ఉదయ భాస్కర్ గారు, వన్ టౌన్ ఎస్‌ఐ శ్రీ వై. సుధాకర్ గారు, త్రీ టౌన్ ఎస్‌ఐ రాంబాబు గారు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.