ఎలమంచిలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ,లబ్ధిదారులకు అండగా కూటమి ప్రభుత్వం!

ఎలమంచిలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ,లబ్ధిదారులకు అండగా కూటమి ప్రభుత్వం!

01/July/2026 20:30    Share:   

అనకాపల్లి జిల్లా, (క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలిలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు..
ఎలమంచిలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ రోడ్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందేలా చర్యలు చేపట్టిందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రోడ్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, గొంతు మూర్తి కొండయ్య నాయుడు, కొనగల భాస్కర్, సేరపశెట్టి శ్రీను, కరణం నాగేష్, సేనాపతి కనకరాజు నాయుడు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter