యలమంచిలిలో విబిజి రాంజీ పథకంపై అవగాహన కార్యక్రమం..

యలమంచిలిలో విబిజి రాంజీ పథకంపై అవగాహన కార్యక్రమం..

18/August/2026 20:09    Share:   

నీటి యాజమాన్య సంస్థ అదనపు పిడి మణికుమార్ సూచనలు
యలమంచిలి, ఆగస్టు 18: కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన విబిజి (బహుళ ప్రయోజన గ్రామీణ జీవనోపాధి) రాంజీ పథకాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు యలమంచిలిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ పథకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఉన్న అధికారులందరికీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మణికుమార్ తెలిపారు.ఈ పథకంలో 125 రోజుల పనులు కల్పిస్తామని, వ్యక్తిగత ఆస్తుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గ్రామపంచాయతీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. భూగర్భ జలాలను పెంచే పనులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ పండ్ల తోటలు నాటించడం ద్వారా రైతులకు ఆర్థికంగా సహకారం అందిస్తామని, ఈ పథకాన్ని విజయవంతంగా వినియోగించుకోవాలని ఆయన హితవు పలికారు.ఈ కార్యక్రమంలో యలమంచిలి మండల అధ్యక్షులు రాజాన సూర్య చంద్ర శేషగిరిరావు ప్రసంగిస్తూ, జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబం కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని కోరారు. వేతనదారులు ఎక్కువ మొత్తంలో పనులు నిర్వహించినట్లయితే 40 శాతం నిధులు గ్రామంలో మౌలిక సదుపాయాలకు కేటాయిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో  వి. దీపిక యలమంచిలి క్లస్టర్ ఏ పి డి ఎరకయ్య ఏపీవో వరలక్ష్మీ  ఆరు మండలాల నుంచి వచ్చిన ఎం పీ టీ సీ లు వి బి జి రాంజీ సిబ్బంది పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter