గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: నర్సీపట్నం ఎస్డీపీఓ పి.శ్రీనివాసరావు*

గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: నర్సీపట్నం ఎస్డీపీఓ పి.శ్రీనివాసరావు*

05/June/2026 07:59    Share:   

*సరైన పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం* 
 
*ముగ్గురు గంజాయి వినియోగదారుల గుర్తింపు* 
 
*గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: నర్సీపట్నం ఎస్డీపీఓ పి.శ్రీనివాసరావు* 
 
*అనకాపల్లి (నర్సీపట్నం రూరల్​)
అనకాపల్లి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు, గంజాయి నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నర్సీపట్నం ఎస్డీపీఓ శ్రీ పి.శ్రీనివాసరావు గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, నర్సీపట్నం రూరల్ సర్కిల్ సీఐ ఎల్.రేవతమ్మ, సర్కిల్ ఎస్సైలు రాజారావు, దామోదర్ నాయుడు, తారకేశ్వరరావు, రామారావు, రిషికేశ్వరరావు మరియు దాదాపు 70 మంది పోలీస్ సిబ్బందితో కలిసి నేడు తెల్లవారుజామున నర్సీపట్నం మండలం, గబ్బడ గ్రామంలో భారీ 'కార్డన్ అండ్ సెర్చ్' (Cordon and Search) నిర్వహించారు.
 
​'ఆపరేషన్ వజ్రప్రహార్' (Operation Vajrapahar) లో భాగంగా చేపట్టిన ఈ తనిఖీల్లో ఈ క్రింది కీలక ఫలితాలు సాధించారు:
*వాహనాల స్వాధీనం:* సరైన ధృవీకరణ పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలను, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*గంజాయి వినియోగదారుల గుర్తింపు:* గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయి తాగుతూ పట్టుబడిన ముగ్గురు (3) వ్యక్తులను గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు చేపట్టారు.
*గ్రామస్థులతో అవగాహన సదస్సు – నిందితులకు హెచ్చరిక* 
​సోదాల అనంతరం నర్సీపట్నం ఎస్డీపీఓ గారు గబ్బడ గ్రామ ప్రజలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లాను పూర్తిగా గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. యువత మత్తుపదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
​ఇదే సమయంలో గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన పాత నేరస్థులను, అనుమానితులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మళ్లీ గంజాయి రవాణా చేసినా, విక్రయించినా, లేదా సహకరించినా వారిపై కఠినమైన పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేస్తామని మరియు చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఎస్డీపీఓ గారు గట్టిగా హెచ్చరించారు.
 
​జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, మత్తు పదార్థాల విక్రేతలపై 'ఆపరేషన్ వజ్రప్రహార్' నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
గంజాయి లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972/112/100 పోలీసులకు ఫిర్యాదు చేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచబడతాయని జిల్లా పోలీస్ యంత్రాంగం తెలిపింది.
 
Breaking News

Subscribe our Newsletter