అంగన్‌వాడీ కార్యకర్తలకు రెండవ విడత శిక్షణ పూర్తి

అంగన్‌వాడీ కార్యకర్తలకు రెండవ విడత శిక్షణ పూర్తి

10/November/2026 19:21    Share:   

​యలమంచిలి :
మండలంలోని తులసి నగర్ గర్ల్స్ హైస్కూల్‌లో ఆదర్శ శిశు, గ్రోత్  కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు రెండవ విడత రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి యలమంచిలి సి.డి.పి.ఓ. కె. ఇందిరాదేవి ప్రారంభించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి ఇఓ రమ్య, సూపర్‌వైజర్ అపరంజిని ఫెసిలిటేటర్లుగా వ్యవహరించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ​ఈ రెండు రోజుల శిక్షణలో భాగంగా.. నవచేతన, ఆదర్శ శిశు, గ్రోత్ మానిటరింగ్ (పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ), నవచేతన స్క్రీనింగ్‌తో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన జియో ట్యాగింగ్, ఎఫ్.ఆర్.ఎస్., తదితర కీలక అంశాలపై అంగన్‌వాడీ కార్యకర్తలకు సమగ్ర శిక్షణ అందించారు.
Breaking News

Subscribe our Newsletter