క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గోకివాడ గ్రామం మూలజంప–మూలకొత్తూరు కోకో రిసార్ట్స్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎలమంచిలి నియోజకవర్గం జేఏసీ కన్వీనర్ ద్వారపరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవికి పర్యావరణ పరిరక్షణపై ఎంతో ఆసక్తి ఉందన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చిరంజీవి సూచించారని తెలిపారు.చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఇలాంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు.