కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి.అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాలు. 

 కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి.అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాలు. 

24/July/2026 19:34    Share:   

ఎలమంచిలి లో విజయవంతంగా జరిగిన విద్యాసంస్థల బంద్, ఛలో పార్లమెంట్ కార్యక్రమంలో విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, అక్రమ అరెస్టులకు పాల్పడిన కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం!  కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి.అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాలు. 
న్యూఢిల్లీ జంతర్ మంతర్‌లో 20వ తేదీన నిర్వహించిన "ఛలో పార్లమెంట్" కార్యక్రమంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, అక్రమంగా అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కు రాష్ట్రంలోని విద్యార్థి, యువజన సంఘాలన్నీ పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమంలో భాగంగా *, ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ * ఆధ్వర్యంలో చోడవరం కాలేజీ జంక్షన్ నుండి బస్ స్టాండ్ వరకు ర్యాలీ, మానవహారం జరిగింది.
ఈ కార్యక్రమంలో *ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు రాజేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జగదీష్, * మాట్లాడుతూ నీట్ పరీక్ష అవకతవకలు, పరీక్షా వ్యవస్థలో పెరుగుతున్న అవినీతి, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై న్యాయం కోరుతూ దేశం నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు, యువత జంతర్ మంతర్‌కు చేరుకుని పార్లమెంట్ వైపు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారనీ అయితే వారి న్యాయమైన డిమాండ్లపై స్పందించాల్సిన కేంద్ర ప్రభుత్వం భారీ పోలీసు బలగాలను మోహరించి, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, విద్యార్థులను అడ్డుకోవడంతో పాటు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం చేసి, అనేక మందిని అక్రమంగా అదుపులోకి తీసుకుందన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై దమనకాండకు దిగడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనన్నారు. లాఠీలు, అరెస్టులు, నిర్బంధాలతో విద్యార్థి ఉద్యమాలను అణచివేయలేరనీ అన్నారు. 2022, 24 ఇప్పుడు 26 లో వరుసగా జరుగుతున్న నీట్ లీకేజీ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనీ, పేపర్ లీకేజీ కారణంగా మరణించిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు . న్యాయం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టడం, అరెస్టు చేయడం దుర్మార్గమని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులందరినీ విడుదల చేయాలి. వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలి. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని అన్నారు. 
 నీట్ పేపర్ లీకేజీ కారణంగా మరణించిన విద్యార్థులకు న్యాయం చేయాలని నిరసనలో పాల్గొన్న విద్యార్థినిలు, మహిళలను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, అసభ్యంగా తాకారని ఇదేనా మోడీజీ "భేటీ బచావో బేటి పడావో" అంటే అని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు కూడా ఈ దేశ యువతకు లేదా అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో SFI సిద్దు కార్తీక్  సామ్యూల్ దుర్గాప్రసాద్  మనోజ్ దిలీప్ బంగార్రాజు AISF నాయకులు. మణికంఠ కుల్దీప్  తదితరులు  పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter