అలివేలుమంగా స్కూల్ లో అగ్నిప్రమాదాల పై అవగాహన కార్యక్రమం
23/July/2026 06:54
Share:
యలమంచిలి: స్థానిక గాంధీనగర్ లో అలివేలుమంగ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో బుధవారం యలమంచిలి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డి రాంబాబు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది రవి కుమార్, తాతాజీ, పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అగ్నిప్రమాదాలు పట్ల అవగాహన కల్పించారు.పాఠశాలలో, ఇంటి వద్ద, పెట్రోల్ బంక్ లో, ఇతర పరిసరాల్లో అనుకోని సందర్భంలో అగ్నిప్రమాదం సంభవించి నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. షాపింగ్ మాల్, థియేటర్ లో ఎమర్జెన్సీ ఏక్సిట్ మార్గాలు తప్పకుండా గమనించాలి అని తెలియచేసారు. ఆపదలో ఏవిధంగా మనల్ని మనం కాపాడుకోవలెను తెలియచేసారు. ఫైర్ ఎక్సటింగ్విషర్ ను ఉపయోగించే విధానం విద్యార్థులకు చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ జె కామేశ్వరి, ప్రిన్సిపాల్ ధీరజ్ నాగ్, శారద, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.