ఏటికొప్పాక గ్రంథాలయంలో యువతకు మరిన్ని పుస్తకాలు అందుబాటులోకి..

ఏటికొప్పాక గ్రంథాలయంలో యువతకు మరిన్ని పుస్తకాలు అందుబాటులోకి..

27/August/2026 19:24    Share:   

యలమంచిలి : CA న్యూస్ రిపోర్టర్ ఆనంద్

ఏటికొప్పాక గ్రామ గ్రంథాలయాన్ని ఎలమంచిలి గ్రంథాలయ లైబ్రేరియన్ వి. ఆనంద్ రావు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి వారం బుధవారం ఏటికొప్పాక గ్రామ గ్రంథాలయంలో అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయ శాఖలో సిబ్బంది పోస్టుల కొరత ఉండటంతో గ్రంథాలయాల నిర్వహణలో కొంత ఇబ్బంది ఏర్పడుతోందని వి. ఆనంద్ రావు తెలిపారు.ఏటికొప్పాక గ్రంథాలయంలో యువత, విద్యార్థులకు అవసరమైన న్యూస్ పేపర్లు, వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అలాగే తమకు కావాల్సిన పుస్తకాలు ఏవైనా ఉంటే గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన నోట్‌బుక్‌లో వాటి వివరాలను నమోదు చేయాలని సూచించారు. యువత అవసరాలకు అనుగుణంగా మరిన్ని పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.గ్రంథాలయానికి సంబంధించి ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయని, వాటిని కూడా దశలవారీగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వి. ఆనంద్ రావు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter