పూడిమడకలో ఉచిత మెడికల్ క్యాంప్, సిఐటియు అచ్యుతాపురం మండల కమిటీ..!

పూడిమడకలో ఉచిత మెడికల్ క్యాంప్, సిఐటియు అచ్యుతాపురం మండల కమిటీ..!

30/May/2026 15:51    Share:   

ఉచిత వైద్య శిబిరం విజయవంతం ,సిఐటియు

సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూడిమడకలో ఉచిత మెడికల్ క్యాంప్.... సిఐటియు అచ్యుతాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో పూడిమడక గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు మాట్లాడుతూ సిఐటియు కార్మికుల కోసం హక్కుల కోసం పోరాడుతూనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అందులో భాగంగా పూడిమడక గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడమైనది నేడు పేదలకు విద్యా ,వైద్యం ఖర్చు విపరీతంగా పెరుగుతుందని ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని పేదలకు అందకుండా చేస్తున్నాయని. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని మన ఆహార అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని సోషలిస్టు దేశాలలో విద్యా వైద్యం పేదలందరికీ ఉచితంగానే అందిస్తారని మనదేశంలో విద్య వైద్యం కార్పొరేట్ పరం అయిపోయిందని పేదలకు వైద్యం ఎంతో అవసరం ఉందని ఆరోగ్యం బాగోక వేలకు వేల రూపాయలు అప్పులు చేసి ఖర్చు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయని కావున ఇలాంటి వైద్య శిబిరాలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజా వైద్య ఆరోగ్య వేదిక కన్వీనర్ టి కామేశ్వరరావు గారు, మేడి కవర్ హాస్పిటల్ డాక్టర్ సాయి, డాక్టర్ కిరణ్, విష్ణు డెంటల్ డాక్టర్ ఏ సుధీర్, ఆప్తమాలజిస్ట్ శ్రీ నేత్ర ఐ కేర్ డాక్టర్ సిద్దు వైద్య సేవలు అందించారు సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కె సోము నాయుడు, సిహెచ్ తాతయ్యలు, ప్రజా ఆరోగ్య వేదిక నాయకులు చంద్రమౌళి, మేడికవర్ ఆసుపత్రి సిబ్బంది శ్రీ విష్ణు పోలీస్ క్లినిక్ వైద్య సిబ్బంది శ్రీ నేత్ర ఐ కేర్ ఆసుపత్రి సిబ్బంది వైద్య సేవలో అందించారు సుమారు 250 మంది ప్రజలకు ఉచితంగా బిపి, షుగర్, కంటి పరీక్షలు డెంటల్ పరీక్షలు నిర్వహించారు. 
Breaking News

Subscribe our Newsletter