పత్తికాయవలసలో టీడీపీలోకి 50 కుటుంబాల చేరిక  పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కళావెంకటరావు

పత్తికాయవలసలో టీడీపీలోకి 50 కుటుంబాల చేరిక పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కళావెంకటరావు

03/October/2026 20:03    Share:   

చీపురుపల్లి, అక్టోబర్ 3:

చీపురుపల్లి మండలం పత్తికాయవలస గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. మాజీ ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌ దన్నాన రామచంద్రుడు ఆధ్వర్యంలో మీసాల శిమ్మి నాయుడు సహా పలువురు టీడీపీలో చేరారు.ఈ సందర్భంగా చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు సమక్షంలో చేరిక కార్యక్రమం నిర్వహించారు. పార్టీలో చేరిన వారికి కళావెంకటరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

క్రైమ్ ఎనాలసిస్ రిపోర్టర్
చీపురుపల్లి ఎస్.ఏ.ఎన్. రాజు
Breaking News

Subscribe our Newsletter