యలమంచిలిలో రూ. 24 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
09/October/2026 20:32
Share:
యలమంచిలి :
యలమంచిలి పురపాలక సంఘంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం భారీ స్థాయిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం వి.ఎం.ఆర్.డి.ఏ నిధులతో మొత్తం రూ. 24.00 కోట్ల (రూ. 2,400 లక్షలు) అంచనా వ్యయంతో మంజూరైన 97 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వార్డుల్లో శంకుస్థాపనలు చేశారు. దీంతో పురపాలక పరిధిలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర ప్రాథమిక వసతులను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధికి దశలవారీగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు, కూటమి నాయకులు నానాజీ, బద్దపు శ్రీను, కొటారు సాంబ, కర్రీ ఝాన్సీ, బద్ధపు నాగేశ్వరరావు, దంట్ల వెంకటస్వామి, కొట్టారు శ్రీనివాసరావు, మజ్జి రామకృష్ణ, నమ్మి రమణ, అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, యువకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.