అనకాపల్లి (ఎ.కోడూరు), ఆగస్టు 21: 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా రేపు (ఈనెల 22న) గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి జిల్లాకు రానున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకుని విశాఖపట్నం రేంజ్ ఐజి శ్రీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ మరియు అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గార్లు ఈరోజు కె.కోటపాడు మండలం, ఎ.కోడూరు గ్రామంలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు.కార్యక్రమ ప్రాంగణం, హెలిప్యాడ్, విఐపి రూట్ మరియు బందోబస్తు ఏర్పాట్లను ఉన్నతాధికారులు నిశితంగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఐజీ శ్రీ గోపినాథ్ జట్టి గారు మాట్లాడుతూ:అలసత్వానికి తావులేదు: బందోబస్తు విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అత్యంత నిబద్ధత, అప్రమత్తతతో విధులు నిర్వహించాలి.స్పష్టమైన మార్గదర్శకాలు: ముఖ్యమంత్రి గారి పర్యటనను అత్యంత విజయవంతం చేయడానికి సిబ్బందికి పాటించాల్సిన నియమావళి పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.సమన్వయం: భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు రాకుండా వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో
మాడుగుల శాసనసభ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర పోలీసు అధికారులు, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.