కార్మిక సమస్యల పరిష్కారానికై చలో ఢిల్లీ, సిఐటియు ..

కార్మిక సమస్యల పరిష్కారానికై చలో ఢిల్లీ, సిఐటియు ..

27/September/2026 16:44    Share:   

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు రద్దుచేసి, కార్మికులకు నెలకు 42000 కనీసం పెంచాలని డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో జరిగే చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని సిఐటియు అచ్యుతాపురం మండలం లో సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము మాట్లాడుతూ దేశవ్యాప్తంగా   కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక ఆందోళన నిర్వహించినా మోడీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న అన్ని రకాల కార్మిక హక్కులను తీసివేస్తుంది 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లు  గా మార్చి ప్రైవేట్ పెట్టబడుదారులకు కార్మికుల శ్రమను అప్పనంగా దోచుకుంటుందని కార్మికులకు  ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనం 42,000 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కాకుండా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని డిసెంబర్ 1 ,2, 3 చలో ఢిల్లీ ఆక్రమణ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న స్కీం వర్కర్లు, అసంఘటితరంగ కార్మికులు, ఉద్యోగులు పాల్గొనాలని మోడీ ప్రభుత్వం సంపద సృష్టించే కార్మిక వర్గంపై తీవ్రమైన దోపిడి చేస్తూ కార్మిక హక్కులను కాలరాశి యాజమాన్యాలకు బానిసలుగా మార్చుతుందని 8 గంటల పని దినం 12 గంటలకు మార్చుతుందని పీఎఫ్ ,ఈఎస్ఐ, బోనస్, గ్రాడ్యుటి ,సమ్మె   హక్కులను కాలరాస్తుందని ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచడం లేదని 29 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించి ధరల  పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమణ, నాగేశ్వరరావు, విజయ, లావణ్య, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter