రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం,ఎమ్మెల్యే విజయ్ కుమార్.
30/June/2026 08:40
Share:
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా విత్తనాల పంపిణీ...! అనకాపల్లి జిల్లా జూన్ 29: ( క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మామిడివాడ గ్రామంలో రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రోడ్లు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయానికి అవసరమైన సౌకర్యాలు అందిస్తూ రైతు కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబూజీ, మండల ప్రెసిడెంట్ రాజన్నశేషు,కొనగల భాస్కర్,సేపరశెట్టి శ్రీను,కరణం నగేష్, సేనాపతి కనకరాజు నాయుడు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.