మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో పార్వతీపురం జిల్లా ఇన్‌ఛార్జ్ దాడి రత్నాకర్ భేటీ:

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో పార్వతీపురం జిల్లా ఇన్‌ఛార్జ్ దాడి రత్నాకర్ భేటీ:

27/September/2026 19:31    Share:   

స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ

నిమ్మాడ (శ్రీకాకుళం):

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో పార్వతీపురం మన్యం జిల్లా ఇన్‌ఛార్జ్ దాడి రత్నాకర్ ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, పార్టీ కార్యాచరణపై వీరిరువురూ విస్తృతంగా చర్చించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కేడర్‌ను సమాయత్తం చేసే వ్యూహాలపై దాడి రత్నాకర్ మంత్రితో సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు.



క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. ఈ భేటీలో పలువురు స్థానిక నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter