ఉపాధ్యాయులు,విద్యా శాఖ అధికార్లు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి.

ఉపాధ్యాయులు,విద్యా శాఖ అధికార్లు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి.

17/May/2026 07:09    Share:   

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలుపై విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ ... 

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబరు నుండి శనివారం రాబోయే విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరికలుపై విద్యాశాఖ, సంబంధిత అధికారులతో జిల్లా జాయింటు కలెక్టరు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరికలు కోసం ప్రత్యేక ప్రచార, అవగాహన కార్యక్రమాలు వేగవంతం చెయ్యాలని అన్నారు. జిల్లాలో అంగన్వాడీలలో  ప్రీ స్కూలు చదువుతున్న వారిలో 11, 200 మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో మొదటి తరగతిలో చేర్పించేందుకు లక్ష్యం కాగా, ఇంతవరకు 6,329 మంది పిల్లలను బడులలో చేర్పించామని, మిగిలిన వారిని కూడా త్వరలో  చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వ్యయంతో మౌళిక వసతులు కోసం వెచ్చిస్తోందని తెలిపారు. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం క్రింద రూ 15 వేలు, ఉచిత యూనిఫార్ములు, పాఠ్యపుస్తకాలు, స్కూలు బ్యాగులు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ద్వారా నాణ్యమైన విద్యాబోధన, డిజిటల్ క్లాస్ రూమ్లు, తదితర సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లించలేక అనేక మంది తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు  గురించి వివరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుటకు ఆసక్తి చూపినప్పటికీ, కొంతమంది  ప్రైవేటు యాజమాన్యాలు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించి తల్లిదండ్రులను చైతన్యపరచాలని అధికారులను కోరారు. ప్రతి పాఠశాలలో 60 మంది విద్యార్థులు తగ్గకుండా ఉండాలని అన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారికి 10, మండల విద్యాశాఖ అధికారికి 2, యంపిడివోకు 1 చొప్పున పాఠశాలలను దత్తత తీసుకుని లక్ష్యాలను అధిగమించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, మండల విద్యాశాఖ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter