క్రైమ్ అనాల్సిస్ |టివియస్ ప్రకాష్ - యలమంచిలి : యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ జిల్లా పరిషత్ అతిథి గృహంలో బుధవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలపై అర్జీలను మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, ఎంపీడీవో కొండలరావు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను స్వీకరించి వాటిని పరిశీలించారు. అనంతరం ప్రజలతో మాట్లాడిన అధికారులు, తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చందర్రావు, బొద్దపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.