2027 జనగణన (Census) కోసం ఎన్యుమరేటర్లకు శిక్షణ ప్రారంభం..!!
10/April/2026 08:32
Share:
2027 జనగణన (Census) కోసం ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సర్వే పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనుండటంతో, అధికారులకు సాంకేతిక పరిజ్ఞానం, డేటా సేకరణపై శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా జనగణనకు అవసరమైన వేగం మరియు నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది క్రైమ్ అనాలిసిస్ టివియస్ ప్రకాష్, సోషల్ మీడియా ఇంచార్జ్ : వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న భారత జనగణనలో భాగంగా ముందస్తుగా గృహ ఎన్యుమరేషన్ నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గురువారం అనకాపల్లి జిల్లాలోని అన్ని మండలాల్లో ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ విజయ్ కృష్ణన్, ఐఏఎస్ ఆదేశాల మేరకు, జిల్లా రెవెన్యూ అధికారి (డి ఆర్ ఓ ) వై.ఎస్.వి.కె.జి.ఎస్.ఎల్. సత్యనారాయణ రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాస్థాయిలో ట్రైనర్లకు శిక్షణ పూర్తవగా, వారు ఇప్పుడు ఎన్యుమరేటర్లకు శిక్షణ అందిస్తున్నారు.ఈనెల 16 నుంచి 30 వరకు ప్రజలకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ అవకాశం కల్పించబడింది. ఈ సమయంలో మొబైల్ ఫోన్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్న వారికి ఒక ప్రత్యేక ఐడీ నంబర్ జారీ అవుతుంది. అనంతరం మే 1 నుంచి 30 వరకు ఇంటింటి గణన (హౌస్ టు హౌస్ ఎన్యుమరేషన్) నిర్వహించబడుతుంది.సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసిన వారు ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడీ నంబర్‌ను తెలపడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది. స్వయంగా వివరాలు నమోదు చేసుకోలేని వారు, తమ నివాసాలకు వచ్చిన ఎన్యుమరేటర్‌కు అవసరమైన సమాచారం అందించాలి.గృహ గణన సమయంలో ఒక్కో కుటుంబం నుంచి మొత్తం 34 అంశాలపై వివరాలు సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు.