జంపపాలెం చెరువు మట్టిపై మాఫియా కన్ను..!అక్రమ రవాణా..!!

జంపపాలెం చెరువు మట్టిపై మాఫియా కన్ను..!అక్రమ రవాణా..!!

25/May/2026 17:09    Share:   

కలెక్టర్‌కు గ్రామస్థుల ఫిర్యాదు..!!!
 
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
యలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలోని మొండిగడ్డ చెరువులో మట్టి, చెరువు గట్టు అక్రమంగా తరలిస్తున్నారంటూ గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 88లో ఉన్న ఈ చెరువు స్థానిక రైతులు, పశువులకు ప్రధాన నీటి వనరుగా ఉపయోగపడుతోంది.
గ్రామస్థుల వివరాల ప్రకారం, గత 15 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కూలీల శ్రమతో చెరువు గట్టును నిర్మించి సంరక్షిస్తూ వస్తున్నారు. అయితే గత వారం రోజులుగా గ్రామానికి చెందిన శిలపరశెట్టి సూర్య అప్పలనాయుడు మరికొందరితో కలిసి జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో చెరువులోని మట్టిని, గట్టును అక్రమంగా తవ్వి విక్రయిస్తున్నారని ఆరోపించారు.
ఈ అక్రమ తవ్వకాల వల్ల చెరువు ఉనికి ప్రమాదంలో పడిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో రైతులకు సాగునీటి కొరత ఏర్పడటంతో పాటు పశువులకు తాగునీరు కూడా దొరకని పరిస్థితి వస్తుందని తెలిపారు.
అంతేకాకుండా చెరువు పరిసరాల్లో ఉన్న సర్వే రాళ్లను తొలగించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఘటనపై అధికారులు తక్షణమే విచారణ చేపట్టి, అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే చెరువును ఆక్రమణల నుంచి రక్షించాలని జంపపాలెం గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
Breaking News

Subscribe our Newsletter