అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాంబిల్లిలో రాస్తారోకో

అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాంబిల్లిలో రాస్తారోకో

03/March/2026 20:09    Share:   

యలమంచిలి రాంబిల్లి మండలం కేంద్రంలో విజయవాడలో రాష్ట్రవ్యాప్తంగా, అంగన్వాడీలు శాంతియుతంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని, జీతాలు పెంచాలని, నిరసన వ్యక్తం చేస్తుంటే, మంగళవారం తెల్లవారు, దీక్షా శిబిరంపై, వేల సంఖ్యలో పోలీసులను మోహరించి, మహిళలు అని కూడా చూడకుండా, కూటమి ప్రభుత్వం, విచక్షణారహితంగా అంగన్వాడిని అరెస్టు చేయడం అన్యాయమని సిఐటియు జిల్లా కార్యదర్శి జి దేవుడు నాయుడు ప్రభుత్వ విధానాన్ని ఖండించారు. గతంలో అంగన్వాడీలు, జగన్ ప్రభుత్వంలో, 42 రోజులు దీక్షలు చేస్తుండగా, నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చాక, మీ అందరికీ మంచి చేస్తానని, నన్ను నమ్మండని, జీతాలు పెంచుతానని వాగ్దానం చేసి, మా వాగ్దానం అమలు చేయాలని అన్నారు. జీతాలు పెంచాలని, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, శాంతియుతంగా నిరసన చేస్తుంటే, ఇంత దుర్మార్గంగా అరెస్టులు చేసి, పోలీస్ స్టేషన్ లకి తీసుకువెళ్లడం న్యాయమా అని తెలిపారు. అప్పుడు జగన్ కి, ఇప్పుడు మీకు తేడా ఏమిటని ప్రశ్నించారు. కార్పొరేట్లకు వేల కోట్లు రాయితీలు ఇస్తున్నప్పుడు, చిరుద్యోగులకు, కనీసం జీతం పెంచవలసిన బాధ్యత లేదా అని అన్నారు. కనీసం వారితో మాట్లాడవలసిన బాధ్యత అయినా ఉందా లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకొని, అంగన్వాడీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, వై రాము, నూకరాజు, రాంబాబు, శివాజీ, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter