మే 23న మునగపాక  రాధాకృష్ణ ఏసీ కళ్యాణ మండపంలో  రైతు సంఘం  మహాసభ..

మే 23న మునగపాక రాధాకృష్ణ ఏసీ కళ్యాణ మండపంలో రైతు సంఘం మహాసభ..

20/May/2026 17:50    Share:   

రైతాంగ సమస్యల పరిష్కారానికై రైతు సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయాలి: కూండ్రపు సోము నాయుడు

అనకాపల్లి మునగపాక
రైతాంగ సమస్యల పరిష్కార దిశగా రైతు సంఘం తొమ్మిదవ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ కూండ్రపు సోము నాయుడు పిలుపునిచ్చారు. ఈ మహాసభ మే 23 (శనివారం) ఉదయం 10 గంటలకు మునగపాక రాధాకృష్ణ ఏసీ కళ్యాణ మండపంలో ప్రారంభమవుతుందని తెలిపారు.

రైతు సమస్యలపై చర్చ – భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన

ఈ మహాసభలో రైతులు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా:

  • రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
  • ఎరువుల ధరలు తగ్గించాలి, అవసరమైన ఎరువులు–విత్తనాలు సరఫరా చేయాలి
  • కౌలు రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ. 20,000 ఇవ్వాలి
  • భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం న్యాయం చేయాలి

అచ్యుతాపురం రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు

మహాసభను జయప్రదం చేయడానికి అచ్యుతాపురం మండలంలోని రైతులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కూండ్రపు సోము నాయుడు కోరారు.ఈ కార్యక్రమంలో తోట వెంకటేష్, మైలపల్లి రమణ, నడుపూరు సోంబాబు, కొల్లి రాము, కూండ్రపు సన్యాసిరావు, కూండ్రపు సన్నిబాబు, కూండ్రపు అప్పారావు, తట్ట అప్పారావు, లాలం రాము, ధర్మ రెడ్డి, సత్యనారాయణ, పిల్లా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter