వివరాలు వెల్లడించిన డిఎస్పి శ్రావణి సీఐ, స్వామి నాయుడు. సిబ్బందికి ప్రశంసలు మిస్టరీని ఛేదించిన కశింకోట పోలీసులు కశింకోట పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.111/2026, U/Sec 194 BNSS (అనుమానాస్పద మృతి) కేసును ఎస్.ఐ శ్రీ కె. లక్ష్మణరావు గారు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు సమయంలో మృతురాలు దమ్ము నాగమ్మ (85 సంవత్సరాలు), నివాసం కశింకోట గ్రామం, హత్యకు గురైనట్లు వెలుగులోకి రావడంతో, కశింకోట సి.ఐ శ్రీ ఎ. స్వామి నాయుడు గారు కేసును U/Sec 103(1), 105(a) BNSగా మార్చి తదుపరి దర్యాప్తు చేపట్టారు. కశింకోట సి.ఐ శ్రీ ఎ. స్వామి నాయుడు గారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాధారాలు మరియు ఇతర కీలక సమాచారాన్ని సేకరించి లోతుగా విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా మృతురాలి బంధువురాలు అయిన సిమ్మ సత్య, W/o అప్పారావు, వయస్సు 55 సంవత్సరాలు, నివాసం కొప్పాక గ్రామం, అనకాపల్లి రూరల్ మండలం పై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె తన నేరాన్ని ఒప్పుకున్నది. ముద్దాయి తెలిపిన వివరాల ప్రకారం, అప్పుల బాధలు మరియు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మృతురాలి వద్ద ఉన్న బంగారు చెవిదిద్దులను పొందాలనే ఉద్దేశంతో 16-05-2026 తేదీ రాత్రి మృతురాలి ఇంటికి వెళ్లినట్లు తెలిపింది. మొదట మృతురాలిని బంగారు చెవిదిద్దులను తాకట్టు పెట్టుకునేందుకు ఇవ్వమని అడగగా, ఆమె నిరాకరించినట్లు తెలిపింది. అనంతరం ఇంటి బయట ఎవరూ లేరని నిర్ధారించుకుని, తిరిగి ఇంట్లోకి వెళ్లి మంచంపై పడుకుని టీవీ చూస్తున్న మృతురాలు దమ్ము నాగమ్మ మెడకు తాను ధరించిన చున్నీని బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నది. హత్య అనంతరం మరుసటి రోజు ఉదయం మృతురాలి చెవులకు ఉన్న బంగారు చెవిదిద్దులను తీసుకుని దొంగిలించినట్లు, అనంతరం వాటిని కొప్పాక గ్రామానికి చెందిన ఓ మహిళ వద్ద సుమారు రూ.50,000/-లకు తాకట్టు పెట్టినట్లు తెలిపింది. అలాగే హత్యకు ఉపయోగించిన చున్నీని కశింకోట గ్రామంలోని కాలువలో పడవేసినట్లు ఒప్పుకున్నది. ముద్దాయి ఇచ్చిన నేర ఒప్పుకోలు మేరకు హత్యకు ఉపయోగించిన చున్నీని మరియు దొంగిలించిన బంగారు చెవిదిద్దులను మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు 26-05-2026 తేదీన Post Mortem Examination Opinion Reportను కశింకోట పోలీసులకు అందజేశారు. ఆ నివేదిక ఆధారంగా అనకాపల్లి ఎస్పీ గారి ఆదేశాల మేరకు, డీఎస్పీ శ్రీమతి శ్రావణి గారి ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. కశింకోట సి.ఐ శ్రీ ఎ. స్వామి నాయుడు గారు పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించి, 24 గంటల వ్యవధిలోనే ముద్దాయిని గుర్తించి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ కేసును అత్యంత సమర్థవంతంగా ఛేదించి, తక్కువ సమయంలోనే నిందితురాలిని అరెస్ట్ చేసిన కశింకోట పోలీసు లైన సిఐ అల్లుస్వామి నాయుడు ఎస్సై లక్ష్మణరావు జి శ్రీనివాసరావు, M.శ్రీనివాసరావు మరియు సిబ్బందిని డీఎస్పీ శ్రీమతి శ్రావణి గారు అభినందించారు.