ప్రతి గ్రామంలోనూ మన సంఘం కార్యాలయం ఉండాలి"కార్పొరేషన్ చైర్‌పర్సన్ పిలుపు  

ప్రతి గ్రామంలోనూ మన సంఘం కార్యాలయం ఉండాలి"కార్పొరేషన్ చైర్‌పర్సన్ పిలుపు  

18/May/2026 07:47    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
"నాగవంశీయులంతా ఆర్థికంగా ఎదగాలి, ప్రతి గ్రామంలోనూ మన సంఘం కార్యాలయం ఉండాలి" అని ఏపీ రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఎరుబోతు రమణారావు పిలుపునిచ్చారు.ఆదివారం  ఏలూరు నాగవంశం సంక్షేమ సంఘం భవనంలో జరిగిన ఉభయ గోదావరి జిల్లాల నూతన కమిటీల ఎన్నిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  
రాష్ట్రంలోని అన్ని నాగవంశం సంక్షేమ సంఘం కార్యాలయాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకునేటట్లు ప్రయత్నం చేయాలి. సంఘాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తేనే ప్రభుత్వ పథకాలు చివరి వ్యక్తికి చేరుతాయి" అని స్పష్టం చేశారు. కులవృత్తులను ఆధునికీకరించి ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు.  
అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ కంటుబోతు రామానాయుడు సమక్షంలో పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కాళ్ళ  శ్రావణ్ కుమార్,తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పోలుబోతు సంజీవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  నూతన కమిటీల ఎన్నికతో ఉభయ గోదావరి జిల్లాల నాగవంశీయుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. బాయి వెంకట్రావు, కాళ్ళ ఆదిబాబు, జరజాపు శ్రీనివాసరావు, గరక గంగాధర్ రావు సహా పలువురు నాయకులు పాల్గొని చైర్‌పర్సన్‌ను శాలువా, పూలమాలతో సత్కరించారు.
Breaking News

Subscribe our Newsletter