మహిళల భద్రతే పోలీసుల ప్రాధాన్యత: అనకాపల్లి టౌన్ ఎస్సై విభీషణరావు

మహిళల భద్రతే పోలీసుల ప్రాధాన్యత: అనకాపల్లి టౌన్ ఎస్సై విభీషణరావు

02/May/2026 19:12    Share:   

  • చట్టాలపై అవగాహనతోనే మహిళా రక్షణ సాధ్యం.
  • అనకాపల్లిలో మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు.
  • ఆపదలో ఉంటే డయల్ 100,181 నంబర్లకు ఫోన్ చేయండి: పోలీసుల సూచన.
  • విద్యార్థినులకు చట్టాల పట్ల అవగాహన కల్పించిన అనకాపల్లి పోలీసులు
అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్  పరిధిలోని మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని అనకాపల్లి టౌన్ పోలీసులు శనివారం నిర్వహించారు. ఎస్సై విభీషణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత ముఖ్యమని ప్రతి మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మహిళలను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను రూపొందించిందని మహిళల భద్రతకు పోలీసుల పూర్తి సహకారం ఉంటుందన్నారు. అత్యవసర సమయాల్లో మహిళలు డయల్ 100,1098,181హెల్ప్ లైన్ నెంబర్లు ఫోన్ చేయడం ద్వారా సహాయం పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు వద్దు జీవితమే ముద్దు అంటూ డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని శనివారం గాంధీ నగరంలో గల సంయుక్త డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ విభీషణరావు  ఆధ్వర్యంలో మత్తుపదార్ధాలు వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. యువత భవిష్యత్తు మత్తు పదార్థాల వాడకం వలన నాశనం అవుతుందని యువకులు భవిష్యత్తుపై దృష్టి సారించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. గ్రామాలలో మత్తు పదార్థాలు వినియోగంపై పోలీసులకు డయల్ 100,112,1972 నంబర్లలో సమాచారం అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి టౌన్ ఎస్సై విభేషణరావు మరియు సిబ్బంది సంయుక్త డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter