ఏలూరులో బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం..

ఏలూరులో బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం..

07/September/2026 18:54    Share:   

ఏలూరు: 
ఏలూరులో బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాగవంశం సంక్షేమ సంఘం సభ్యులకు పలు కీలక బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రాలు అందజేశారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వై. నాగేశ్వరరావు గారు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఇంచార్జి నూకానమ్మ గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ లక్కోజు గోపి గారి చేతుల మీదుగా ఈ నియామక పత్రాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా కింది వారు వివిధ హోదాల్లో నియమితులయ్యారు:
  • జిల్లా బీసీ సంక్షేమ సంఘం కోశాధికారిగా: భాయి వెంకట్రావు
  • జిల్లా ఉపాధ్యక్షులుగా: ఎచ్చెర్ల ఉమా మహేశ్వర రావు
  • ఏలూరు నగర ప్రధాన కార్యదర్శిగా: కొండల ప్రసాద్
  • ఏలూరు నగర ఉపాధ్యక్షులుగా: జరజాపు ఉమా
నియామక పత్రాల అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ లక్కోజి గోపి గారిని మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారి శ్రీ బాయి వెంకట్రావు గార్లను సాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం సందర్భంగా నాగవంశం సంక్షేమ సంఘం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నామని నిర్వాహకులు వెల్లడించారు.
– కొండల ప్రసాద్, CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
Breaking News

Subscribe our Newsletter