అనకాపల్లిలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక నిఘా.

అనకాపల్లిలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక నిఘా.

11/June/2026 20:04    Share:   

అనకాపల్లిలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక నిఘా: భారీగా చలానాలు విధింపు
అనకాపల్లి పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలోని వివిధ కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ, నో పార్కింగ్ స్థలాల్లో నిలిపిన ఆటోలపై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ M. వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో చలానాలు విధించారు.
అదేవిధంగా గుండాల జంక్షన్ వైపు నుండి పట్టణంలోనికి నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి అధిక లోడుతో వస్తున్న భారీ వాహనాలను (హెవీ వెహికల్స్) నిలిపివేసి వాటికి కూడా చలానాలు విధించినట్లు అధికారులు తెలిపారు.పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకే ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్ సీఐ M. వెంకట్ నారాయణ గారితో పాటు ఎస్ఐ శేఖరం,ఎస్ఐ అర్జున్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
 
Breaking News

Subscribe our Newsletter