రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు దిక్సూచి ప్రస్తుత బడ్జెట్..

రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు దిక్సూచి ప్రస్తుత బడ్జెట్..

19/February/2026 13:59    Share:   

రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు దిక్సూచి ప్రస్తుత బడ్జెట్..
సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యం..కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టించనుంది..
బడ్జెట్ పై ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హర్షం..
ఏలూరు, ఫిబ్రవరి 19:- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి దూరదృష్టికి నిదర్శనంగా నిలిచిందని ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర సాధనకు పూతమివ్వడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోదెడ్ల బండిల పరుగులు పెట్టించనుందని కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. మొన్న ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ ప్రవేశపెట్టిన 2026-27 కు సంబంధించిన వార్షిక బడ్జెట్ పై సమావేశాన్ని ఏర్పాటు చేసి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరుని ఆయన కొనియాడారు. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సామాన్యుల అవసరాలను తీర్చేందుకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు.. ఏపీ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా నిలవడంతో పాటు వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వనుండని చెప్పారు..
బడ్జెట్ స్వరూపాన్ని పరిశీలిస్తే..
2026-27 వార్షిక బడ్జెట్ రూ.3,32,25 కోట్లు కాగా, ఇందులో రెవిన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు అని పేర్కొన్నారు.. మూలధన వ్యయం రూ.53,915 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22,0, 02 కోట్లు, కాగా ద్రవ్యలోటు రూ.75,8,68 కోట్లు అన్నారు..
ఇక బడ్జెట్ కేటాయింపు వివరాలను పరిశీలిస్తే..రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6000 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.13,9,34 కోట్లు, రోడ్లు, ఎయిర్పోర్టులకు రూ.13,5,46 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు, పరిశ్రమలకు రూ.3,161 కోట్లు, సర్దుబాటు నిధికి రూ.1500 కోట్లు,  స్వచ్ఛ భారత్ మిషన్ కి రూ.1037 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4000 కోట్లు, జల్ జీవన్ మిషన్ కు రూ.4000 కోట్లు కేటాయింపులు జరపడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచిందన్నారు..
2026-27 రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం నీటి భద్రత కేటాయింపుల విషయానికొస్తే.. 
మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.9906 కోట్లు, అన్నదాత సుఖీభవ రూ.6600 కోట్లు, పోలవరం రూ.6105 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రూ.1927 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు, మత్స్యకార సేవలు రూ.260 కోట్లు, పంటల భీమా రూ.250 కోట్లు, పియం కృషి యోజన రూ.190 కోట్ల రూపాయల కేటాయింపులు ఏపీ సీఎం చంద్రబాబు సమర్ధతకు అద్దం పట్టేలా ఉన్నాయని కొనియాడారు.. 
సంక్షేమ పథకాలు కార్యక్రమాల కేటాయింపులను పరిశీలిస్తే..
ఎన్టీఆర్ భరోసా రూ.27,719 కోట్లు, దీపం 2.0 రూ.2601 కోట్లు, వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతు రూ.2320 కోట్లు, స్త్రీ శక్తికి రూ.1420కోట్లు, వీకర్ సెక్షన్లకు, సబ్సిడీ ఉచిత విద్యుత్ రూ.600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలకు రూ.450 కోట్లు, తల్లికి వందనం రూ.968 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమం రూ.4,581 కోట్లు, ఉపకార వేతనాలు రూ.3836 కోట్లు, సమగ్ర శిక్షణ రూ.2946 కోట్లు, ఉన్నత విద్య రూ.2566 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రూ.2161 కోట్లు, మనబడి మన భవిష్యత్తు రూ.1500 కోట్లు, నైపుణ్యాభివృద్ధి రూ.1232 కోట్లు, పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా రూ.707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర రూ.654 కోట్లు, యువత క్రీడలు రూ.438 కోట్లు కేటాయింపులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచిందన్నారు..
శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపుల విషయానికి వస్తే.. 
వ్యవసాయ అనుబంధ రంగాలు రూ.13,598 కోట్లు, పంచాయితీరాజ్  రూ.22,942 కోట్లు, మున్సిపల్ శాఖ రూ.14,539 కోట్లు, జల వనరుల శాఖ రూ.18224 కోట్లు, పాఠశాల విద్యాశాఖ రూ.3238 కోట్లు, ధన శాఖ రూ.13,934 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ రూ.118 కోట్లు, కార్మిక శాఖ రూ.735 కోట్లు, గృహనిర్మాణ శాఖ రూ.6357 కోట్లు, రోడ్లు భవనాల నిర్మాణ శాఖ రూ.986 కోట్లు, హోం శాఖ రూ.9165 కోట్ల కేటాయింపులు ప్రభుత్వ శాఖలను బలోపేతం చేయడంలో కూటమి ప్రభుత్వం చూపుతున్న చొరవను తెలియజేస్తుందని తెలియజేశారు..
అసెంబ్లీకి పట్టుమని పది నిమిషాలు కూడా ఉండకుండా ఇంటి దగ్గర కూర్చుని బడ్జెట్ పై వైసీపీ నాయకులు ప్రేలాపనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంకల్పం ఉన్నచోట సాధనకు మార్గం ఉంటుందనే నినాదాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ నిజం చేసిందన్నారు. గత ప్రభుత్వ అసమర్ధ పాలనలో చితికిన రాష్ట్రానికి ఆశాదీపమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమాన్ని నిచ్చెనగ మార్చుకొని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ రూపొందించారని ఆయన తెలిపారు. అమరావతి, పోలవరం రెండు కల్లుగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు, యువకుల నుంచి మహిళల వరకు, రైతుల నుంచి అన్ని వర్గాల ప్రజల వరకు మేలు చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావడం శుభ పరిణామం అని చెప్పారు.. మీడియా సమావేశంలో రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు, బొత్స మధు, కూని శెట్టి మురళి కృష్ణ, కొండల ప్రసాద్, బెజవాడ నాగభూషణం కుమార్, జనసేన రవి, వాసా సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter