మొక్కజొన్న రైతులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.సిపిఐ ఏలూరు కార్యదర్శి..
05/May/2026 19:54
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు మొక్కజొన్న రైతులకు మద్దతు ధర ఇవ్వాలి.సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్.సహాయ కార్యదర్శులు కురెళ్ల వరప్రసాద్, అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా. భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఏలూరు ఏరియా సమితి మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు ఏరియా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం.మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని,మొక్కజొన్న రైతాంగాన్ని ఆదుకోవాలని, మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు పోరాడుతామని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 13 జిల్లాల్లో సుమారు పన్నెండు లక్షల యాభై వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ 2,400 మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని,రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వలన దళారులు మొక్కజొన్న రైతుల నుండి 1700 కు కొనుగోలు చేయడం వలన క్వింటాకు 700 రూపాయల చొప్పున మొక్క జొన్న రైతులు ఎకరానికి 21వేలు నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.సహాయ కార్యదర్శులు కురెళ్ల వరప్రసాద్, అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలను ఇచ్చిందని ఎన్నికల అనంతరం ఆ హామీల అమలకు చర్యలను తీసుకోలేదని ఆరోపించారు. మొక్కజొన్న రైతులు తమ పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం సహాయం చేయకపోవడం వలన దళారుల చేతిలో మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల తహశీల్దార్ కు వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యులు కొల్లూరి సుధారాణి,మావూరి విజయ, గొర్లి స్వాతి,జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు, ఏరియా కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు, తమ్మిశెట్టి రమణయ్య, బళ్ల కనకదుర్గారావు,దాచిపల్లి ఆదినారాయణ, ఉప్పులూరీ లక్ష్మి, జ్యోతి, కొండేటి మేరీ, ఆలూరి రమేష్,ఎం. ఏ.హకీమ్, తదితరులు పాల్గొన్నారు.