డీఎస్పీని మర్యాదపూర్వకలగా కలిసిన ప్రెస్ ఫోరమ్ సభ్యులు: ఎన్నికల నిర్వహణపై కృతజ్ఞతలు

డీఎస్పీని మర్యాదపూర్వకలగా కలిసిన ప్రెస్ ఫోరమ్ సభ్యులు: ఎన్నికల నిర్వహణపై కృతజ్ఞతలు

29/April/2026 07:20    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు: 
ఏలూరు ప్రెస్ ఫోరమ్ నూతన కార్యవర్గ సభ్యులు స్థానిక డీఎస్పీ గారిని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రెస్ ఫోరమ్ అధ్యక్షులు ద్రోణంరాజు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి పి. రవీంద్ర కుమార్, గౌరవ అధ్యక్షులు పి.వి.ఏ. ప్రసాద్, పి.ఆర్.ఓ ఎస్. సంజయ్ ఇతర సభ్యులు డీఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.జరిగిన ప్రెస్ ఫోరమ్ ఎన్నికలు అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో, పారదర్శకగా జరగడానికి పోలీసు యంత్రాంగం అందించిన సహకారం మరువలేనిదని వారు కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో డీఎస్పీ గారు తీసుకున్న ముందస్తు చర్యలు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చేశాయని ప్రతినిధులు పేర్కొన్నారు.అనంతరం ప్రెస్ ఫోరమ్ భవిష్యత్తు కార్యకలాపాలు మరియు జర్నలిస్టుల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై డీఎస్పీ గారితో చర్చించారు. ఫోరమ్ అభివృద్ధికి మరియు జర్నలిస్టులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు తమ శాఖ తరపున ఎల్లప్పుడూ ఉంటాయని డీఎస్పీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Breaking News

Subscribe our Newsletter