చింతలపూడి నియోజకవర్గంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటన.

చింతలపూడి నియోజకవర్గంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటన.

31/August/2026 19:49    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,‎ఏలూరు,
చింతలపూడి నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఉదయం 10 గంటల సమయంలో లింగపాలెం మండలం  అయ్యపరాజుగూడెం గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి మరియు శ్రీ పిడుగులమ్మ తల్లి అమ్మవార్ల జాతర మహోత్సవాల్లో  పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇటీవల గుండెపోటుతో మరణించిన లింగపాలెం మండలం మఠంగుడెంకు చెందిన టీడీపీ నేత ఘంటా సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ, కామవరపుకోట మండలం కంఠమనేనివారిగూడెంలో ఇటీవల మరణించిన  రైతు నాయకుడు, ఎర్రకాలువ ఎత్తిపోతల పథకం సంఘం చైర్మన్ కంఠమనేని సత్యనారాయణ విగ్రహావిష్కరణ, సంతాప సభలో పాల్గొని నివాళులు అర్పించారు. మార్గమధ్యలో పలు వివాహాది శుభకార్యాలకు, నూతన వస్త్ర బహుకరణ వేడుకలకు హాజరయ్యారు. రామానుజపురం గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ నాయకురాలు అడపా నాగలక్ష్మి దంపతుల కుమారుని వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏలూరు NNR గార్డెన్స్ లో జరిగిన ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయ సిబ్బంది మల్లేశ్వరరావు గారి కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోవు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం సాయంత్రం 5:30 నిమిషాల సమయంలో ఏలూరు పట్టణం, చాటపర్రుకు చెందిన టీడీపీ నేత, మాజీ ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోవు దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు.
Breaking News

Subscribe our Newsletter