అనకాపల్లి విశాఖ జిల్లాల జర్నలిస్టుల క్రికెట్ పోటీలు.
05/February/2026 14:18
Share:
రాంకీ ఫౌండేషన్, పీజేఎస్డబ్ల్యుఏ సంయుక్త విశాఖ ఫార్మాసిటీ డీజీఎం గిరిధర్ రావు భక్షి, రాంకీ ఫౌండేషన్ డిప్యూటీ హెడ్ డా"శ్రీకాంత్. ఆధ్వర్యంలో నేడు, రేపు అనకాపల్లి విశాఖ జిల్లాల జర్నలిస్టులకు ఆహ్వానపు క్రికెట్ పోటీలు.
పరవాడ: ఫిబ్రవరి 5: పరవాడ జర్నలిస్టు స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, రాంకీ ఫౌండేషన్ సహకారంతో శుక్ర ,శనివారాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాల జర్నలిస్టులకు ఆహ్వానపు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాంకీ ఫౌండేషన్ డిప్యూటీ హెడ్ డా"శ్రీకాంత్ తెలిపారు. ప్రతి సంవత్సరం విశాఖ ఫార్మసిట క్రీడ మైదానంలో జర్నలిస్టులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. దీనిలో భాగంగా ఈనెల 6, 7 తేదీల్లో జర్నలిస్టులకు ఆహ్వానపు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రికెట్ పోటీల్లో పాల్గొనే జట్లకు రాంకీ ఫౌండేషన్ కార్యాలయంలో విశాఖ ఫార్మాసిటీ డీజీఎం గిరిధర్రావు భక్షి సమక్షంలో డ్రా తీయడం జరుగుతుదని తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలకు చెందిన మొత్తం 8 జట్లు ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. పోటీల్లో విజయం సాధించే జట్లకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, వ్యక్తిగత బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులకు అన్ని మూలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ని ఉద్దేశించి డీజీఎం గిరిధర్రావు భక్షి మాట్లాడుతూ నిత్యం పని ఒత్తుల్లతో సతమతమయ్యే జర్నలిస్టులకు ఈ క్రికెట్ పోటీలు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి జర్నలిస్టులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పరవాడ జర్నలిస్ట్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సిహెచ్ లోకేష్, ఎండి రాజు, జట్టు కెప్టెన్ శ్రీను, రాధా కృష్ణ, రామ్ కి ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొనున్నారు.