జిల్లా కలెక్టర్ చొరవతో 50 క్రీడా మైదానాల ఏర్పాటు". జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పూజారి శైలజ.
19/February/2026 20:07
Share:
యువతను క్రీడల వైపు ప్రోత్సహించే ప్రణాళిక అమలు. జిల్లా కలెక్టర్ చొరవతో 50 క్రీడా మైదానాల ఏర్పాటు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పూజారి శైలజ. అనకాపల్లి ఫిబ్రవరి 19 అనకాపల్లి జిల్లాలో యువత గంజాయి ఇతర మాదక ద్రవ్యాల బారినపడి నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ యువతను క్రీడల వైపు మరలిచేందుకు జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రణాళికను రూపొందించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి నేతృత్వంలో ఈ ప్రణాళికను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పలు మండలాల్లో 50 క్రీడా మైదానాలు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ నిధులు మంజూరు చేశారు. 17 వాలీబాల్ క్రీడా మైదానాల నిర్మాణం పూర్తయిందని మార్చి రెండో వారంలో మిగతా క్రీడా మైదానాల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పూజారి శైలజ తెలిపారు. ఈ నెల 24న సైక్లింగ్ నిర్వహించనున్నట్టు దీనికి సంబంధించి పోటీలో పాల్గొనే వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏడాదంతా పలు ఈవెంట్లలో క్రీడలు నిర్వహించినట్టు శైలజ తెలిపారు. https://sports.ap.gov.in/#/home/sl/sl-index