జిల్లా స్థాయి స్కూల్ లీగ్ చెస్ పోటీలు విజయవంతం

జిల్లా స్థాయి స్కూల్ లీగ్ చెస్ పోటీలు విజయవంతం

02/March/2026 17:45    Share:   

అనకాపల్లి (జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ) మార్చి 02 రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయి స్కూల్ లీగ్ చెస్ పోటీలను తిరుపతి స్టేడియంలో ఫిబ్రవరి 21న & 22న విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి శ్రీమతి పూజారి శైలజ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

అనకాపల్లి జిల్లా నుండి బి. క్రావ్య శ్రీ - అండర్ 15 మొదటి బహుమతి, బి. సహస్ర, అండర్ -13 మూడవ బహుమతి, వి. వెంకటేశ్వర రావు, అండర్ -17 మూడవ బహుమతి లను గెలుపొందారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిణి, శ్రీమతి పూజారి శైలజ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారుల సమక్షంలో గౌరవ జాయింట్ కలెక్టర్ గారిచే అభినందించబడ్డారు. ఇందులో శ్రీ సుదీర్ కుమార్, చెస్ అంపైర్ మరియు క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter