యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో మార్చి 1వ తేదీ నుండి సబ్ జూనియర్స్ బాలుర, బాలికల రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కొఠారు నరేశ్ తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయన్నారు. 2010 అక్టోబర్ 1 తరువాత జన్మించినవారు అర్హులుగా పేర్కొన్నారు. పోటీల్లో ఎంపికైన వారు బాలురు జార్ఖండ్ లోను, బాలికలు బీహార్ రాష్ట్రంలోనూ ఆడతారని తెలిపారు.