జాతీయస్థాయిలో హాకీ పోటీలకు అనకాపల్లి జిల్లా నుంచి కోరుకొండ దుర్గా శ్రావణి ఎంపిక..!
31/March/2026 21:02
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, సోషల్ మీడియా ఇంచార్జ్, యలమంచిలి అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణానికి చెందిన కోరుకొండ దుర్గా శ్రావణి జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం.ఆమె ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరగనున్న సబ్ జూనియర్ నేషనల్ హాకీ పోటీలలో పాల్గొనేందుకు బయలుదేరింది. ఏప్రిల్ 1, 2026 నుండి రాంచీలో నిర్వహించబడనున్న హాకీ ఇండియా బాలికల సబ్ జూనియర్ జాతీయ పోటీలకు హాకీ ఆంధ్రప్రదేశ్ జట్టులో కోరుకొండ దుర్గా శ్రావణి ఎంపికైనట్లు అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే. నరేష్ వెల్లడించారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,యలమంచిలి మున్సిపల్ మాజీ ఛైర్మన్ పిళ్లా రమా కుమారి, సీనియర్ హాకీ క్రీడాకారులు మరియు జిల్లా హాకీ అసోసియేషన్ సభ్యులు గిన్నె వరహాల రెడ్డి, జి. రాంబాబు, ఎస్. రమేష్, మహేష్ తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.