సీనియర్ క్రీడాకారుల నుంచి రూ.50 వేల క్రీడా సామగ్రి అందజేత..!! యలమంచిలి హాకీ సెంటర్‌లో శుక్రవారం సీనియర్ హాకీ క్రీడాకారులు మజ్జి గణేష్, కొల్లి హర్ష తమ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా యువ క్రీడాకారులకు రూ.50 వేల విలువైన క్రీడా సామగ్రిని అందించారు.కేంద్ర ప్రభుత్వ ఏజీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు చేస్తున్న ఈ క్రీడాకారుల కుటుంబ సభ్యులు కొల్లి దేవి, మజ్జి దేవి చేతుల మీదుగా గోల్‌కీపర్ కిట్, బిబ్స్, బాల్స్ పంపిణీ చేశారు. ఈ సహాయం తమ సొంత నిధులతో అందించడం విశేషం.ప్రతి ఏడాది క్రీడాకారులకు ఇదే విధంగా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కోటారు నరేష్, గిన్నె వరహాల రెడ్డి, డి. మహేష్, జి. రాంబాబు, హర్షతో పాటు స్థానిక కోచ్ లోకేష్ పాల్గొన్నారు.