HDL And LDL |  అంటే ఏమిటి..? మ‌న శ‌రీరంలో HDL And LDL అస‌లు ఎంత ఉండాలి..?

HDL And LDL | అంటే ఏమిటి..? మ‌న శ‌రీరంలో HDL And LDL అస‌లు ఎంత ఉండాలి..?

31/January/2026 12:09    Share:   

మ‌న గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో మంచి కొలెస్ట్రాల్ లేదా హెచ్‌డిఎల్ కీల‌క‌పాత్ర పోషిస్తుంది. ఇది ర‌క్తంలోని అద‌న‌పు కొలెస్ట్రాల్ ను శుభ్రం చేసి గుండె జ‌బ్బుల ముప్పును త‌గ్గిస్తుంది. హెచ్‌డిఎల్ ఒక స్కావెంజ‌ర్ లాగా ప‌ని చేస్తుంది. ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కాలేయానికి పంపిస్తుంది.
HDL And LDL | మ‌న గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో మంచి కొలెస్ట్రాల్ లేదా హెచ్‌డిఎల్ కీల‌క‌పాత్ర పోషిస్తుంది. ఇది ర‌క్తంలోని అద‌న‌పు కొలెస్ట్రాల్ ను శుభ్రం చేసి గుండె జ‌బ్బుల ముప్పును త‌గ్గిస్తుంది. హెచ్‌డిఎల్ ఒక స్కావెంజ‌ర్ లాగా ప‌ని చేస్తుంది. ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కాలేయానికి పంపిస్తుంది. కాలేయం ఈ చెడు కొలెస్ట్రాల్ ను బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతో ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌వు. ఇక మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు 40 mg/dl కంటే త‌క్కువ‌గా ఉంటే ప్ర‌మాదంగా భావిస్తారు. 40 నుండి 59 mg/dl స్థాయిల‌ను సాధార‌ణంగా ప‌రిగ‌ణిస్తారు. 60 mg/dl లేదా అంత‌కంటే ఎక్కువ స్థాయిల‌ను ఉత్త‌మంగా ప‌రిగ‌ణిస్తారు. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం కూడా త‌క్కువ‌గా ఉంటుంది. క‌నుక మంచి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను ఎలా మెరుగుప‌రుచుకోవాలో తెలిసి ఉండ‌డం ముఖ్యం
Breaking News

Subscribe our Newsletter