తల్లిపాలే శిశువుకు సంపూర్ణ పోషణ,రేగుపాలెంలో అవగాహన కార్యక్రమం.
05/August/2026 16:20
Share:
యలమంచిలి మండలం రేగుపాలెం గ్రామ అంగన్వాడి కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, నవజాత శిశువులకు తల్లిపాలు సంపూర్ణ ఆహారమని, తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. అలాగే గర్భిణులు, బాలింతలు తల్లిపాల ప్రాధాన్యాన్ని తెలుసుకుని ప్రతి శిశువుకు తల్లిపాలు అందేలా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, మూడు సంవత్సరాల లోపు పిల్లల తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు.PHN సూపర్వైజర్ లీల, ఏఎన్‌ఎమ్ రేవతి, ఆశా వర్కర్ కె. లక్ష్మి, అంగన్వాడి సిబ్బంది SK. పాతిమునిషా, ఆర్. కనకలక్ష్మి, రంజిన్ బేబీ (AWH), ఎం. లోవలక్ష్మి (AWH) పాల్గొని తల్లిపాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. క్రైమ్ అనాలసిస్ ప్రతినిధి ఆనంద్