ఉచిత కంటి పరీక్షలు దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
14/February/2026 16:32
Share:
దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ -అటానమస్ కళాశాలలో డైట్ అధ్యాపక, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది, సాంకేతిక సిబ్బంది మరియు బస్ డ్రైవర్లకు మేనేజ్మెంట్ వారి ప్రోత్సాహంతో, అత్యంత విలువైన మరియు అధిక ధరలతో కూడినటువంటి ఈ కంటి పరీక్ష డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారి సహకారంతో కళాశాల చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ గారు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రజల్లో కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం మరియు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం. ఆసుపత్రి నుండి వచ్చిన నిపుణులైన వైద్యులు మరియు వైద్య సిబ్బంది కంటి చూపు పరీక్షలు, కంటి పీడన పరీక్ష, ముత్యబిందు పరీక్షలు మరియు అవసరమైన సలహాలను అందించారు. ఈ శిబిరంలో మొత్తం 200 మందికి పైగా కళాశాల స్టాఫ్ పాల్గొని ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారు. మరింత చికిత్స అవసరమైన వారికి ఆసుపత్రికి సూచించారు . ఈ శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన వైద్య బృందానికి మరి నిర్వాహకులకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు గారు కృతజ్ఞతలు తెలియజేశారు.