548 మందికి ఉచిత వస్తి కర్మ చికిత్స ఆయుర్వేద రంగంలో చారిత్రాత్మక ప్రపంచ రికార్డు.

548 మందికి ఉచిత వస్తి కర్మ చికిత్స ఆయుర్వేద రంగంలో చారిత్రాత్మక ప్రపంచ రికార్డు.

19/August/2026 08:47    Share:   

అనకాపల్లి, ఆగస్టు 18:
చరక జయంతి ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆగస్టు 16 నుంచి 18 వరకు నిర్వహించిన మెగా ఆయుర్వేద వైద్య శిబిరం చారిత్రాత్మకంగా నిలిచింది. ఈ శిబిరంలో 548 మంది రోగులకు ఉచితంగా వస్తి కర్మ చికిత్స అందించారు.
వస్తి కర్మతో పాటు విద్ధ కర్మ, అగ్ని కర్మ వంటి ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలను కూడా అందించారు. 548 మందికి ఉచితంగా వస్తి కర్మ నిర్వహించినందుకు ది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ గుర్తింపు లభించింది. సంస్థ భారతదేశ ముఖ్య అడ్జుడికేటర్ యతీష్ శుక్లా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి, రికార్డు సర్టిఫికెట్, ట్రోఫీ, మెడల్‌ను ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, వరము చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వ ఆయుర్వేద పరిషత్ అనుసంధాన ప్రకోష్ట్ ప్రభారి డా. టి. సుందర రాజ్ పెరుమాల్కు అందజేశారు.
ఈ మెగా శిబిరానికి “సౌత్ ఇండియన్ చరక”గా పేరొందిన డా. ఎన్. ఆంజనేయ మూర్తి మార్గదర్శకత్వం వహించారు. కార్యక్రమ విజయానికి విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు డా. సత్యనారాయణ, ఉత్తరాంధ్ర విభాగం అధ్యక్షులు డా. ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి డా. దుర్గేష్ కుమార్, డా. కవిత సుందర రాజ్, డా. సుశీల మూర్తి, డా. దివ్య భారతి, డా. గాయత్రి దేవి, డా. కమలాకర్ తదితర వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, నిర్వాహకులు కృషి చేశారు.
ఈ రికార్డు కేవలం అవార్డు మాత్రమే కాదని, ఆచార్య చరకుని వారసత్వానికి, ఆయుర్వేద వైద్యుల సేవాభావానికి, భారతీయ వైద్య విధానం పట్ల అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది, వాలంటీర్ల సమిష్టి కృషికి దక్కిన గౌరవమని డా. సుందర �
Breaking News

Subscribe our Newsletter