Diabetes | షుగ‌ర్ ఉన్న‌వారు ఈ మిల్లెట్ల‌ను తీసుకోవాలి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Diabetes | షుగ‌ర్ ఉన్న‌వారు ఈ మిల్లెట్ల‌ను తీసుకోవాలి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

04/February/2026 20:28    Share:   

మ‌ధుమేహ వ్యాధి గ్రస్తులు ఆహారం తీసుకునే విష‌యంలో ప్ర‌తిరోజూ ఒక స‌వాల్ ను ఎదుర్కొంటార‌ని చెప్ప‌వచ్చు. ఎందుకంటే వీరు తీసుకునే ఆహారం త‌క్ష‌ణ‌మే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను పెంచుతుంది, అనారోగ్యానికి కూడా దారి తీస్తుంది. క‌నుక ఆహార విష‌యంలో మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Diabetes | మ‌ధుమేహ వ్యాధి గ్రస్తులు తీసుకునే ఆహారం త‌క్ష‌ణ‌మే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను పెంచుతుంది, అనారోగ్యానికి కూడా దారి తీస్తుంది. క‌నుక ఆహార విష‌యంలో మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. చాలా మంది చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుకోవ‌డానికి చ‌పాతీల‌ను తీసుకుంటూ ఉంటారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయ‌ని ఇవే స‌రైన ఆహారం అని న‌మ్ముతారు. అయితే ఇవే కాకుండా మిల్లెట్స్ తో చేసిన ఆహారాల‌ను తీసుకోవ‌డం మంచిద‌ని వైద్యులు చెబుతున్నారు. చిరుధాన్యాలు త‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను క‌లిగి ఉంటాయి. దీంతో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు వెంట‌నే పెర‌గ‌కుండా ఉంటాయి. వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక నెమ్మ‌దిగా జీర్ణ‌మ‌వుతాయి. దీంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెర‌గ‌డంతో పాటు స్థిర‌మైన శ‌క్తి విడుద‌ల అవుతుంది.

సామ‌లు..

మిల్లెట్స్ అన్నీ మేలు చేసేవే అయిన‌ప్ప‌టికీ సజ్జ‌లు, సామ‌లు, కొర్ర‌లు అనే ఈ మూడు ర‌కాల మిల్లెట్స్ మ‌రింత మేలు చేస్తాయ‌ని వైద్యులు తెలియ‌జేస్తున్నారు. ఈ మిల్లెట్స్ లో ఫైబ‌ర్ తో పాటు పోష‌కాలు, యాంటీ ఆక్సీడెంట్లు కూడా ఉంటాయని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వారు సూచిస్తున్నారు. సామ‌లు త‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను క‌లిగి ఉంటాయి. ర‌క్తంలో గ్లూకోజ్ ను నెమ్మ‌దిగా విడుద‌ల చేయ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. దీంతో రక్తంలో చ‌క్కెర పెరుగుద‌ల నివారించ‌బ‌డుతుంది. వీటిలో ఉండే అధిక ఫైబ‌ర్ గ్లూకోజ్ ను నియంత్రించ‌డంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది. సామ‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించి మొత్తం శ‌రీరానికి మేలు చేస్తాయి. వీటిలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక జీర్ణ‌శ‌క్తి కూడా మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

కొర్ర‌లు..

కొర్ర‌లు వాటి త‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కు, ఫైబ‌ర్ కు ప్ర‌సిద్ది చెందాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో, ఇన్సులిన్ నిరోధ‌క‌త‌ను త‌గ్గించ‌డంలో ఇవి ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖ‌నిజాలు కూడా ఉంటాయి. క‌నుక కొర్ర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తపోటు అదుపులో ఉంటుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. మంచి బ్యాక్టీరియాను పెంపొందించ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కూడా కొర్ర‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి.

స‌జ్జ‌లు..

స‌జ్జ‌ల్లో మెగ్నీషియం, ఐర‌న్, క్యాల్షియం వంటి ఖ‌నిజాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎముకలు దృఢంగా త‌యార‌వుతాయి. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇవి త‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను క‌లిగి ఉంటాయి. క‌నుక వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీంతో బ‌రువు అదుపులో ఉంటుంది. డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు ఈ మూడు ర‌కాల మిల్లెట్స్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్కెర స్థాయిలు ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంటాయి. శ‌రీర మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. వీటితో త‌ర‌చూ పాన్‌కేక్స్, కిచిడీ, పొంగల్, ఉప్మా, దోశ‌, ఇడ్లీ వంటి వాటిని కూడా త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చ‌ని వైద్యులు తెలియ‌జేస్తున్నారు.

Breaking News

Subscribe our Newsletter